13-06-2025 12:00:00 AM
న్యూయార్క్, జూన్ 12 (విజయక్రాంతి): అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో వలస విధానాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చేపట్టిన దాడులకు వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శనివారం నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 400 మంది నిరసనకా రులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
గురువారం 200 మందిని అదుపు లోకి తీసుకున్నట్టు సమాచారం. నిరసనలు ఆస్టిన్, న్యూయార్క్, టెక్సాస్, చికాగో, డల్లా స్, డెన్వర్ సహా పలు నగరాలకు వ్యాపించాయి. లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ నగరంలోని డౌన్‌టౌన్ ప్రాంతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.