calender_icon.png 22 May, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం.. అంతా ఆగమాగం

22-05-2025 12:00:00 AM

  1. మార్కెట్ యార్డుల్లో రైతుల ఇబ్బందులు..
  2. కలెక్టర్ గారు.. పంట నానుతోంది ఆదుకోండి అంటూ అన్నదాతల వేడుకోలు.. 

ఆదిలాబాద్, మే 21 (విజయ క్రాంతి):  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాలంగా కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు బుధవారం కురిసిన అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దింతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, గుడిహత్నూర్, బేల, తాంసి, భీంపూర్ తదితర మండలాల్లో భారీగా వర్షం కురిసింది.

ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు లేచిపోయాయి.  మరోవైపు పలు మండలాల్లో జొన్న పంటను మార్కెట్ కు తీసుకువచ్చిన రైతులు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా కురుస్తున్న అకాల వర్షాలతో బేల మండలంలోని మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అమ్మకానికి తెచ్చిన జొన్న పంట తూకం అయినప్పటికీ లారీలు లేకపోవడంతో పంటను తరలించడం లేదంటూ, దింతో కలెక్టర్ గారు పంట నానుతోంది తమ పంటను గోదాములకు తరలించాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షంతో బేలలో జరిగిన అంగడిలో అంత ఆగమాగం అయింది.

ప్రతి బుధవారం బేల లో అంగడి (బజార్) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు తమ తమ దుకాణాల కోసం గుడారాలు వేసుకోగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో గుడారాలని కూలిపోయి దుకాణంలోని సామాగ్రి వర్షానికి తడిసిపోయింది. దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఖానాపూర్‌లో తడిసిన ధాన్యం

ఖానాపూర్, మే౨౧ (విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం వల్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న వర్ధాన్యం పూర్తిగా తడిసిపోయినట్టు రైతులు తెలిపారు. వర్షంతో పాటు బలమైన గాలులు వేయడంతో వరికుప్పలపై రక్షణ కోసం ఏర్పాటుచేసిన తార్పిన్ కవర్లు లేచిపోవడంతో వర్షం కారణంగా పంట తడిసిపోవడంతో రైతులు పంటను కాపాడుకు నేందుకు చీకట్లో పడరాని పాటలు పడ్డారు.

సుమారు ఖానాపూర్ కొనుగోలు కేంద్రంలోని 100కుప్పలు తడిసిపోయినట్టు రైతు లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేయాలని వారు అధికారులకు విన్నవిస్తున్నారు.