3 July, 2026 | 9:34 PM

Breaking News

నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •  

డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కొడుకును హతమార్చిన తండ్రి

22-05-2025 12:00 AM

కామారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : డబ్బుల కోసం నిత్యం వేధిస్తుండడంతో ఉద్దేశ్యపూర్వకంగానే కొడుకును తలపై కొట్టి తండ్రి హత్య చేశాడని కామారెడ్డి సబ్ డివిజనల్, ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ రెండు నెలల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు.

అయితే వచ్చినప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసైన నిఖిల్ ప్రతిరోజూ డబ్బుల కోసం తండ్రిని వేధించేవా డు. వేధింపులు భరించలేక ఈనెల 19న నిఖిల్‌ను తండ్రి బాలరాజు రాడ్డుతో నిఖిల్ తలపై కొట్టి హత్య చేశాడు. కొడుకును హత్య చేసిన బాలరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సు రాజు పాల్గొన్నారు.