calender_icon.png 2 November, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం..అపార నష్టం

30-10-2025 01:40:44 AM

మరిపెడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన పత్తి వరి రైతులు

మరిపెడ,అక్టోబర్29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రాంతాల్లో పత్తి పంటకు ఇటీవల విపరీతమైన వర్షాలు కారణంగా భారీ నష్టం జరిగింది. పంట కోత దశలో ఉన్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి మరియు దిగుబడి భారీగా పడిపోయింది. ముఖ్యంగా పత్తి పంటలో కాయలు పగిలి పోవడం, రంగు మారడం, వరుసగా  వర్షాలతో పత్తి కాయలు పగిలి పోవడంతో తక్కువ దాణా, రంగు మారడం, పూత రాలిపోవడం జరుగుతోంది.

దిగుబడి తగ్గడం. గత సంవత్సరం ఎకరాకు 10 క్వింటాళ్లు వచ్చి ఉండగా, ఈ ఏడాది 36 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి అంచనాలు ఉన్నాయి. నష్టానికి గల ముఖ్య కారణాలు వరుస వర్షాలు పంట కోత సమయంలో రావడం కాయలు మచ్చలు, కాయలు మురిగి పోవ డం, తేమ ఎక్కువగా ఉండడం పెట్టుబడి కూడా తిరిగి వచ్చిన పరిస్థితి లేదు, మండలం స్థాయిలోని గ్రామాల్లో ఎకరాలను దెబ్బతినడం. 

పత్తి పంట పైనే అత్యధిక ప్రభావం రైతులకు పరిష్కార సూచనలు ఇచ్చి తక్షణ  క్రాప్ డామేజ్ సర్వే చేసి, రైతులకు నష్ట పూరణ అందించాలి. ప్రభుత్వ నష్ట పూరణ, క్రాప్ ఇన్సూరెన్సు మరింత పటిష్టంగా అమలు చేయాలి. ఈ పరిస్థితుల దృష్ట్యా, రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటూ, పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరిపెడ మండలంలోని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని  కోరుకుంటున్నారు.

రెండు గ్రామాలకు రాకపోకలు బంద్

భీమదేవరపల్లి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి) భారీ వర్షానికి భీమదేవరపల్లి మండలంలోని అనేక గ్రామాల లో ఇళ్లల్లోకి నీరు చేరింది, మంగళపల్లి- బో ల్లోనిపల్లి గ్రామాల వద్ద మద్దెల వాగు పొంగి పొరడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మండలంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీడ మునిగాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

మరికొన్ని గ్రామాల్లో పాతబడిన ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ముల్కనూర్ లోని రంగ్ డాబా నీట మునిగింది. బుధవారం వేకువ జాము నుండి రాత్రి వరకు వర్షం భారీ వర్షానికి  ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉన్నారు, భారీ వర్షానికి హనుమకొండ నుండి సిద్దిపేటకు వెళ్లే బస్సులు కూడా పలుమార్లు రద్దు అయ్యాయి. మొత్తం మీద ప్రజలకు ఎవరికీ ప్రాణా నష్టం వాటిల్ల లేదు. 

కలెక్టరేట్‌లో అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

హనుమకొండ, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  కంట్రోల్ రూమ్ ద్వారా సేవలను 24/7 పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ నెంబర్ 7981975495, టోల్ ఫ్రీ నెంబర్ 18004251115 ఏర్పాటు చేసినట్లు  చెప్పారు.

భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని సూచించారు. వరదల కారణంగా అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని ప్రజలను కోరారు.

మొంథా తుఫాన్ తో భారీ వర్షం

హనుమకొండ టౌన్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ఉదయం నుండి వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీవర్షం కురవడంతో పలు కాలనీలు  జలమయం అయ్యాయి. పలు ప్రాంతాలలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ముఖ్యంగా హనుమకొండ బస్టాండు ప్రాంతాలలో రహదారులపై నీరు నిలవడంతో ప్రయాణికులు, వాహనదారులకు అంతరాయం కలిగింది.

పలు కాలనీలలో మోకాళ్ళ లోతు నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో చిన్నపిల్లలు, పెద్దలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయము కలిగింది. ఈ భారీ వర్షంతో పలు కాలనీలోని ప్రజలు విలవిలాడుతున్నారు.