30-10-2025 01:40:49 AM
నల్లగొండ/సూర్యాపేట, అక్టోబర్ 29(విజయక్రాంతి) : రాజ్యాంగాన్ని గౌరవించనోళ్లే అసలైన దేశద్రోహులని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణమాదిగ తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది డపుకు మల్లయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
విశ్వాసాల పేరుతో ధర్మం ముసుగులో న్యాయమూర్తిపై దాడి చేస్తే చట్టపరిధిలోకి రాదా అని ఆయన ప్రశ్నించారు. దళితులపై ఇప్పటికి వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ గవాయ్ మీదనే సుప్రీంకోర్టులో బూటుతో దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయనపై దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారని, కేసులు పెట్టలేదని ,న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదని ,మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించలేదంటే ఈ దేశంలో దళితులకు ఇప్పటికీ రక్షణ లేదని స్పష్టంగా రుజువు అవుతుందన్నారు.
సీజేఐపై జరిగిన దాడిని నిరసిస్తూ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, దళితుల హక్కుల రక్షణకు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి నవంబర్ 1న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా జరగని నిరసన ర్యాలీ హైదరాబాద్‌లో జరుగుతుందని, ప్రతి ఒక్కరు కదలి రావాలని పిలుపునిచ్చారు.
నల్లగొండలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, ఎమ్మేస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ, ఉద్యోగ సంఘం నాయకులు మల్లేపాక వెంకన్న, సీనియర్ నేతలు మేడి శంకర్ మాదిగ, కొమిరే స్వామి మాదిగ, కూరపాటి కమలమ్మ మాదిగ, పోలే యాదయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో నిర్వహించిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సూర్యాపేట అధ్యక్షులు సుంకర లింగయ్య, సుంకరబోయిన రాజు, దావుల వరప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ షఫివుల్లా, ఫరిదుద్దిన్, నూకల సుదర్శన్ రెడ్డి, వసంత సత్యనారాయణ పిళ్లై, ఎమ్మార్పీస్ ఎంఎస్పి సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న, రెబల్ శ్రీను, ఎర్ర వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.