30-10-2025 01:40:33 AM
-పోటీ విజేతలను ప్రకటించిన ఆంధ్ర సారస్వత పరిషత్
-ప్రపంచ తెలుగు మహా సభల వేదికపై బహుమతుల ప్రదానం
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో శ్రీసత్య సాయి స్పిరిచువల్ సిటీ, అమరావతి, గుంటూరు హైవేలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో నిర్వహించనున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ‘కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం’ పోటీల విజేతలను పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ప్రకటించారు.
పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం జనవరి 3న సాయంత్రం 5 గంటలకు ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన వేదికపై ఘనంగా నిర్వహిస్తారని పోటీ సమన్వయకర్త కార్టూనిస్ట్ హరి తెలిపారు. ఎంపికైన ఉత్తమ కార్టూన్లను తెలుగు మహా సభల సందర్భంలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్టూన్ ప్రదర్శనలో ప్రద ర్శించనున్నారని డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలు తెలుగు భాషా, సంస్కృ తి, భావప్రకటనల అభివృద్ధికి కార్టూన్ కళాకారులు అందిస్తున్న సేవలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా ఉన్నాయని అన్నారు.
విజేతలు
రామ్ శేషు, నెల్లూరుెేప్రథమ బహుమతి, సునీల్, అమలాపురం బహుమతి, సరసి, హైదరాబాద్ బహుమతికి ఎంపికయ్యారు. బొమ్మన్ పర్శినాయుడు జిల్లా, కోరాడ రాంబాబు ప్రోత్సాహక బహుమతులు అందుకోనున్నారు.