15 June, 2026 | 8:01 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

13న నిరుపయోగ వస్తువుల

10-05-2026 12:50 AM

శాంతి భద్రతల ఏఐజీ రమణకుమార్

హైదరాబాద్, మే 9(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న వివిధ వస్తువుల విక్రయానికి సంబంధించి ఈ నెల 13న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు శాంతి భద్రతల విభాగం ఏఐజీ రమణ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ స్టోర్స్‌లో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

కార్యాలయంలో విని యోగానికి వీలులేని ఎలక్ట్రికల్ వస్తువులు, ఇనుప సామగ్రి, చెక్క వస్తువులతో పాటు ఇతర పాత సామగ్రిని ఈ వేలంలో ఉంచనున్నట్లు ఆయన వివరించారు.ఈ బహిరంగ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్లు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును తీసుకురావాలని ఏఐజీ రమణ కుమార్ స్పష్టం చేశారు.