17 August, 2026 | 4:01 AM

నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

17-08-2026 12:00 AM

మహబూబ్ నగర్ అర్బన్ 16 : సర్దార్ స ర్వాయి పాపన్న గౌడ్  376వ జయంతి సం దర్భంగా ఈ నెల ఆగస్టు 18 న హైదరాబాద్ ట్యాంక్బ్ంప సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు  మాజీ మున్సిపల్ చై ర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం కంఠ మహేశ్వర దేవాలయం దగ్గర ఉమ్మడి జిల్లా గౌడ సంఘం పెద్దల సమక్షం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జ యంతి పోస్టర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఉమ్మడి పా లమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ సా మాజిక వర్గంతో పాటు బీసీ సమాజం మొ త్తం కదం తొక్కి, కదం కలిపి హైదరాబాద్ ట్యాంక్బ్ంప జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహావిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రేట్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, ప్రధాన కా ర్యదర్శి రాజయ్య గౌడ్, పెన్షనర్స్ అధ్యక్షులు సాయిలు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య గౌడ్, సత్తూరి చంద్రకుమార్ గౌడ్, టి. యా దగిరి గౌడ్   తదితరులు ఉన్నారు.