17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

శంషాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయండి

26-02-2026 12:00 AM

అత్యవసర వైద్య సేవలను ప్రజలకు అందించాలి, మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వినతి

రాజేంద్ర నగర్ ఫిబ్రవరి 25(విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా శంషాబాద్ డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు.

ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిమిత సదుపాయాలతో ఉన్నందున, స్థానిక ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనిని అప్గ్రేడ్ పేద ప్రజలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన నిధులు మంజూరు చేసేందుకు మరియు ఆసుపత్రి స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు..