నిజమైన కర్మయోగి ‘ఉప్పల’
ఆచార్య మసన చెన్నప్ప :
* ‘మీ సంపాదనంతా సమాజానికే ఖర్చు చేస్తున్నారు’ అని ఎవరైనా అంటే ‘నా సంపాదన సమాజం నుంచి వచ్చిందే కదా’ అని సమాధానం ఇచ్చేవారు. ఉప్పల గోపాలరా వు గారు ప్రజాక్షేత్రంలో పేరుగడించిన వారే గాని, వారు ఎన్నడూ ఏ పదవినీ ఆశించిన వారు కాదు. ప్రజా సమస్యలపై గోపాలరా వు గారు చేపట్టిన ఉద్యమాలను చూస్తే, వారి ధైర్యం, ఆలోచనా దృక్పథం తేటతెల్లం అవుతాయి.
సమాచార హక్కుపై ప్రజల్లో సరైన అవగాహన తీసుకురావడం, అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా గొంతెత్తి నినదించడం, జర్నలిజం విలువల్ని పరిరక్షించడం, చెడు ఎక్కడున్నా ఎండగట్టడం మొద లైన అంశాల్లో తనదైన ముద్రవేసినవారు ఉప్పల గోపాలరావు గారు.
అవినీతి, అక్రమార్జన, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం- వీటన్నింటికీ వ్య తిరేకంగా, అవిశ్రాంతంగా పోరాడిన సామాజిక కార్యకర్త ఉప్పల గోపాలరావు గారు.
ఉప్పల గోపాలరావు గారితో నాకు పరిచయం మొదటిసారి ఫతే మైదాన్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. అప్పుడు నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల విద్యార్థిని. మా ప్రిన్సిపాల్ కె.కె.రంగనాథాచార్యు లకు, గోపాలరావు గారికి మిక్కిలి స్నేహం. తరుచుగా గోపాలరావు గారు నిర్వహించే సమావేశాలకు వెళ్లేవాణ్ని. అప్పుడే గోపాలరావు గారి వ్యక్తిత్వం నన్నాకర్షించింది. అవినీ తిపై గల తన ఆగ్రహానికి ప్రతిరూపమే “ప్ర జా ఆలోచనా వేదిక”. ఈ వేదిక పక్షాన వారె న్ని సమావేశాలు నిర్వహించారో చెప్పలేం.
గోపాలరావు గారు ‘సమాచార హక్కు చ ట్టం’ ద్వారా సుపరిపాలన కోసం సీనియర్ సిటిజన్ల సంఘాలను ఏర్పాటు చేశారు. పచ్చదనం కోసం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అనేక ప్రదేశాల్లో పార్కుల ఏర్పాటు వారి ఉద్యమ ఫలితమే.
సామాన్యులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షే మ ఫలాలు అందాలన్న లక్ష్యంతో జీవితాం తం పరిశ్రమించిన చైతన్యమూర్తి గోపాలరావు గారు. ఆయన కేవలం వేదికల మీద సమస్యలను ప్రస్తావించి విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివచ్చి పరిష్కారమయ్యే దాకా పోరాడిన ఉద్యమశీలి.
గోపాలరావు గారు ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. పేద విద్యార్థులకు ఫీజులు కట్టారు. దగాపడిన తమ్ముళ్లకు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఉద్యమాలు చేశారు. అన్నింటికి మిం చి సమాజం గురించి సరైన ఆలోచనను అం దించారు. ‘నువ్వు పుస్తకాలు చదువు, సమాజాన్ని ఇంకా చదువు. నిన్ను నీవు మరింత చదువు’ అని మా కళాశాలలో విద్యార్థులనుద్దేశించి పలికిన పలుకులను నేనింకా మరు వలేదు.
గోపాలరావు గారికి ప్రజాఉద్యమాల్లో పాల్గొనే ప్రతి వ్యక్తితో పరిచయం ఉంది. ఆయన రచయితలను, కవులను ఎంతో గౌరవించేవారు. ‘దాస్ క్యాపిటల్’ గోర్బచెవ్ సంస్కరణలు, గాంధీ ఫిలాసఫీ గురించి మాట్లాడే వ్యక్తి, ఎక్కడో పారిశుద్ధ్య కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిస్తే, అక్కడ ప్రత్యక్షమయ్యేవారు.
‘మీ సంపాదనంతా సమాజానికే ఖర్చు చేస్తున్నారు’ అని ఎవరైనా అంటే ‘నా సంపాదన సమాజం నుంచి వచ్చిందే కదా’ అని సమాధానం ఇచ్చేవారు. ఉప్పల గోపాలరా వు గారు ప్రజాక్షేత్రంలో పేరుగడించిన వారే గాని, వారు ఎన్నడూ ఏ పదవినీ ఆశించిన వారు కాదు. ప్రజా సమస్యలపై గోపాలరా వు గారు చేపట్టిన ఉద్యమాలను చూస్తే, వారి ధైర్యం, ఆలోచనా దృక్పథం తేటతెల్లం అవుతాయి. చిత్రమేమంటే వారు మొదటినుంచి ఏ ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చా రో, ఆ సమస్యలు ఈ నాటికీ ఉన్నాయి.
గోపాలరావు గారికి ప్రజల సమస్యలే నిత్య పఠనీయ గ్రంథాలు. వారికి నటించ డం అంటే ఇష్టం ఉండదు. ప్రజాక్షేత్రంలో ఒక ఆలోచనాపరునిగా జీవించడమంటే చా లా ఇష్టం. ఆయన నిజమైన కర్మయోగి. హై దరాబాదు స్థిరనివాసి. ఆడంబరాలకు, శుష్క వేదాంతానికి దూరంగా ఉండి, తప్పును తప్పుగా గుర్తించిన వ్యక్తి గోపాలరావు. ఆయనను చూసినప్పుడు ఆలోచనాపరుడంటే ఇలా ఉండాలనే అభిప్రాయం కలగ కుండా ఉండదు. ‘మాటకు ప్రాణం సత్యం’ అని సుమతీ శతకకారుడు చెప్పాడు. సత్యా న్ని ప్రాణపదంగా భావించి నడుచుకోవడం వల్లనే ఆయన కంచుకంఠం మంచు కంఠం కాలేదు. మనోవాక్కాయాల త్రికరణశుద్ధికి ఆయన జీవితం ఆలవాలమైంది.
‘చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచైమైన అది కొదువ గాదు’
అని చెప్పిన వేమన చిప్పలవారిని ఆవేశించినాడనిపిస్తుంది. ‘మానవ సేవనే మాధ వ సేవ’గా భావించిన విశిష్ట వ్యక్తి గోపాలరావు. తమ సమయాన్ని, సంపదను, మేధో శక్తిని తోటి ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడాయన.
నేడు సమాజంలో మనిషి కంటే భిన్నం గా మనిషి నడుస్తున్నాడని, మనుష్య నిర్మా ణం విశ్వవిద్యాలయాల్లో జరగడం లేదని, మంచి మనిషికి మనుగడ లేదని భావించిన గోపాలరావు ఒక వ్యాసంలో ‘మాయల మో సాల రాజ్యంలో ఉండాలని లేదు’ అని ప్రకటించారు. అయినా ఆయన ఎనభై ఏళ్లకు పైగా జీవించారు. సాధారణంగా మనం ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉం టాం. కానీ, ఏది చెయ్యాలో అది చేసి నిరూపించిన వ్యక్తి గోపాలరావు గారు.
ఉప్పల ‘ప్రజా ఆలోచనా వేదిక’ ద్వారా సమాజంలోని మేధావులను, ప్రభుత్వ అధికారులను, యువతీయువకులను, వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులను పరిచయం చేశారు. వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిపి చక్కని ఫలితాలను సాధించడానికి ప్రయత్నించారు.
పేదల హితాన్ని తన హితంగా, బడుగు వర్గాల అభ్యున్నతిని తన అభ్యున్నతిగా భావించిన ఉప్పల పరిపాలనలో జవాబుదారీతనం రావాలని ఆకాంక్షించారు. ఆయ న కులం, మతం, భాషా ప్రాంతం అనే భా వాలకతీతంగా ఉండి కార్యక్రమాలను రూపొందించారు. ఉద్యమం అంటే వీధుల్లో పోరాటం కాదు, విధుల్లో (కార్యాచరణలో) మార్పు అని, మనుషుల ఆలోచనల్లో కొత్తదనమని ఆయన భావించారు. అందుకే ఆయనను మేధావులు ‘మహా మనీషి’ అని కొనియాడారు.
గోపాలరావు గారు ఒక సీనియర్ సిటిజన్‌గా తన పాత్రను సమాజంలో చక్కగా నిర్వ హించి, కార్యశీలురైన వయోవృద్ధులకు మార్గదర్శకులయ్యారు. ప్రజలను చైతన్యవంతులను చేసే ‘ప్రజా ఆలోచనా వేదిక’ లాంటి వేదికలు ఈనాడు ఎంతైనా అవసరమని భావించక తప్పదు.
సెల్: 9885654381




