21-08-2025 01:31:14 AM
-కాంగ్రెస్ నాయకులే ఈ నినాదానికి బలం చేకూరుస్తున్నారు
-యూరియా పేరిట కేంద్రంపై తప్పుడు ప్రచారం
-వెంకయ్యనాయుడుకి కాంగ్రెస్ ఎందుకు మద్దతివ్వలే
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మా ర్వాడీ గో బ్యాక్ నినాదాల వెనక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నా యకులే ఇటువంటి నినాదాలకు బలం చేకూరుస్తున్నారని ఆరోపించారు. ఈ దేశ పౌరులంతా దేశం లో ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకునేందుకు రా జ్యాంగం హక్కు కల్పించిందని, దేశంలోని ఏ ప్రాం తం వారైనా ఇక్కడ నివసించేందుకు హక్కు ఉం టుందని స్పష్టం చేశారు.
అంతేకానీ మార్వాడీ గో బ్యాక్ పేరిట నినాదాలు చేయడం కరెక్టు కాదని పే ర్కొన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు తెలుగువాడేకదా అని ఎందుకు మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. బండారు దత్తాత్రేయ కు ఉపరాష్ట్రపతి పద వి ఇవ్వాలన్న సీఎం రేవంత్‌రెడ్డి... ఇప్పు డు ఆ పదవికి బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
యూరియా కొరతపై తెలంగాణలో కృత్రిమ ప్రచారం మొదలుపెట్టి కేం ద్రంపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్వాడీ గోబ్యాక్ నినాదం ము మ్మాటికీ సరైన విధానం కాదన్నారు. తెలుగు ప్రైడ్ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ... గతంలో వెంకయ్యనాయుడికి ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు, ప్రజలకు తీవ్ర అన్యా యం చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.
వీహెచ్‌నైనా ప్రకటించాలి కదా?
ఇండీ కూటమి ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా సుదర్శ న్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ వెళ్లిన సమయంలో బీసీ వర్గానికి చెందిన ద త్తాత్రేయకు ఉపరాష్ర్టపతి పదవి ఇవ్వాలని మాట్లాడారని.. ఇప్పుడు ఆయన ఆత్మప్రబోధన ఏమైంద ని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదన్నారు.
ఆయన ఆత్మప్రబోధన చేసుకుని ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా వి.హన్మంతరావునైనా ప్రకటించాల్సింది కదా అని అన్నారు. ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్పటికైనా ఆత్మప్రబోధన చేసుకు ని ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం బీసీ ఓట్లు మాత్రమే ముఖ్యమని, కానీ రిజర్వేషన్ల విషయం లో వారికి చిత్తశుద్ధి లేనేలేదన్నారు. రేవంత్‌కు భాస్కర్ అవార్డు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలన్నారు.
ఎరువులపై అసత్య ప్రచారం
ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం అవసరానికి మించి యూరియాను సరఫరా చేసిందన్నారు. రాష్ర్ట ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. రైతులను భయపెట్టి “రన్ ఆన్ ఫర్టిలైజర్” పరిస్థితిని తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని విమర్శించారు. వాస్తవా నికి కేంద్రం యూరియా సరఫరా ఎక్కడా ఆపలేదని, ఈ అంశంపై కాంగ్రెస్ చర్చకు రావాలని సవా ల్ విసిరారు. వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే స్టాక్ లేదంటూ అబద్ధాలు చెప్పడం వల్లే కొరత ఏర్పడిందన్నారు.