కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
-టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్
మంచిర్యాల, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్ రహ మత్ హుస్సేన్ అన్నారు. సోమవారం మం చిర్యాల ఎమ్మెల్యే నివాసంలో నియోజక వర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందని, రానున్న స్థానిక ఎన్నికల్లో వారికే మొదటి స్థానం కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, ఇందు లో భాగంగానే 2018లో బీఆర్‌ఎస్ 50 శాతం రిజర్వేషన్ నియంత్రణ బిల్లును కొట్టే స్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం కోసం గవర్నర్ కు బిల్లు పంపిందన్నారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల తో సమావేశం నిర్వహించారు. ఈ విలేకరు ల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఒడ్డె రాజ మౌళి, మునీ, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






