calender_icon.png 2 July, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను వేధిస్తున్న యూరియా కొరత

02-07-2025 01:31:59 AM

పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో ఆధార్ కార్డులతో పడిగాపులు

ఆదిలాబాద్, జూలై 1 (విజయక్రాంతి):  ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో  రైతులను యూరియా కొరత వేధిస్తోంది. వ్యవసాయ పనుల ప్రా రంభంలో ఎంతో ముఖ్యమైన యూరియా సరిపడా లభ్యం కాకపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. తలమడుగు మండలంలోని పల్లి (బి) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో యూరియా కొరత కారణంగా పల్లి(బి), పల్లి(కె) గ్రామా ల్లో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

యూరియాను అందించే కేంద్రాల వద్ద రైతులు తమ తమ ఆధార్ కార్డులను క్యూ లైన్‌లో పెట్టి ఎప్పుడు తన వంతు వస్తుందోనని యూరియా కోసం వేచి చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో చేనులో పనులకు వెళ్లాల్సిన రైతులు గంటల తరబడి యూరి యా కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నా రు. మరోవైపు ఒక రైతుకు 2 యూరియా బ్యాగులను మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎరువుల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.