calender_icon.png 2 July, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలి

02-07-2025 01:33:12 AM

హాస్టళ్లను సందర్శించి సమస్యలపై అరా తీసిన మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, జూలై 1 (విజయక్రాంతి): విద్యార్థులకు ఉజ్వల భవితను అందించే విద్యాలయాల్లో పూర్తి వసతులు కల్పించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం స్థానిక బీసీ గురుకుల పాఠశాల, కొలం ఆశ్ర మ పాఠశాలల్లో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి మెనూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది పలు సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ... విద్యా రంగంపై నిర్లక్ష్యం వహించకుండా లోటుపాట్లను వెం టనే సరిచేయాలని, బీఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్తం గా విద్యా వ్యవస్థలోని లోపాలపై అరా తీస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రభు త్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించడంలో భాగంగా ఆయా పాఠశాలలను సందర్శించి వివరాలు సేకరించడం జరుగుతోందని తెలిపారు.