02-07-2025 12:12:03 PM
వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి గత ఐదు ఏండ్ల నుండి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దసాని రామచంద్రా రెడ్డి చొరవతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) మొగిలిపాక గ్రామానికి బస్సును తిరిగి ప్రారంభమయ్యేటట్లు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ ముద్దసాని లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య, ముద్దసాని రఘుపతిరెడ్డి, మొగిలి పాక పాపయ్య, మహంకాళి, సిద్దయ్య చారి, వెలిసొజు నరేంద్ర చారి, ముద్దసాని జయసింహ రెడ్డి, యాస అంజిరెడ్డి, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.