రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధం
ఉక్రెయిన్‌తో శాంతిఒప్పందమే లక్ష్యంగా ప్రయత్నాలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే వరకు రష్యా మీద కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. యుద్ధం వల్ల విపరీతమైన సమస్యలు వస్తాయని అందుకోసమే శాంతిఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన అన్నారు. ఉక్రెయిన్ దేశం తాము ఫ్రెంచ్‌లో తయారైన మిరేజ్ జెట్స్ వాడతామని ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కనీసం నలుగురు చిన్నారులతో కలిపి 18 మంది ప్రజలు తాజా దాడుల్లో గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా ఉక్రెయిన్‌కు యుద్ధ సహాయాన్ని నిలిపివేసిన వెంటనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో ఉన్న వయోజనులందరికీ యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ ప్రకటించారు.






