calender_icon.png 11 July, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టులో ఉసురే

11-07-2025 12:00:00 AM

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ డి.గోపాల్ దర్శకుడు.

శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో  బకియా లక్ష్మీ టాకీస్  పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్. సీనియర్ హీరోయిన్ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘’ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ.

ఎంతో రియలిస్టిక్ అప్రోతో ఈ ప్రేమకథ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. రొమాన్స్, కామెడి, డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి అంశం ఎంతో ఆస్తకికరంగా, ఉత్కంఠగా ఉంటుంది.కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.