11-07-2025 12:00:00 AM
‘సత్యం సుందరం’తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తారు. కార్తీ ని ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేసిన పోస్టర్ తో మేకర్స్ గురువారం ‘మార్షల్’ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు.
పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ సైతం ప్రారంభించారు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.