6 June, 2026 | 6:17 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తి ఉత్తమ్

01-01-2026 12:00 AM

కోదాడ, డిసెంబర్ 31: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ గోదావరి జిల్లాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే టిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అన్యాయం ఎక్కువని ఆయన అన్నారు.

ఏపీ ప్రతిపాదించిన పోలవరం బనక చర్ల ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని బి ఆర్ ఎస్ నేత మాజీమంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినాడు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈ పిటిషన్ జనవరి 5న విచారణకు  రానున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో నిరంతరం పోరాడే వ్యక్తి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తిపై విమర్శలు తగవున్నారు..