calender_icon.png 1 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప మాలధారులకు భిక్ష ఏర్పాటు

01-01-2026 12:00:00 AM

బండ్లగూడ జాగిర్, డిసెంబర్ 31 ( విజయ క్రాంతి): బండ్లగూడ జాగిర్ లోని పీరం చెరువులోని దాసాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో అయ్యప్ప మాల ధరించిన  స్వాములకు బండ్లగూడ జాగిర్ లోని మాజీ కార్పొరేటర్ నాగుల స్రవంతి నరేందర్ ల ఆధ్వర్యంలో 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో కొనసాగిన  అన్నదాన వితరణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా నరేందర్ దంపతులు మాట్లాడుతూ  అన్ని ధానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని, అటువంటి మహా భాగ్యం మా దంపతులకు దొరకడం అయ్యప్ప స్వామి ప్రసాదించిన  అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

అయ్యప్ప స్వామి అనుగ్రహం తో గత నాలుగేళ్లుగా అయ్యప్ప మలదారులకు అన్నదాన వితరణ చేయడం గొప్ప సేవగా తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఉన్నదాన వితరణ కార్యక్రమంలో  తమ్ముతో పాటు భాగస్వాములైన హిమాయత్ సాగరస్వాములు సురేష్ గురు స్వామి, శివాజీ గురు స్వామి, సంఘం గురుస్వామి, ముఖ్యంగా గణేష్ స్వామి, కన్నాస్వామి, కృష్ణస్వాములు ఎంతో సేవ చేసారన్నారు. ఈ కార్యక్రమంలో బస్వరాజ్, యాదగిరి, సాయి, ఈశ్వరప్ప, సాంబశివ,శివ, దండ బాణీ, ధనూష్ స్వామిల కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.