31 March, 2026 | 1:46 AM

19 మంది బాలికలకు వాక్సినేషన్

31-03-2026 12:12 AM

శంకర్‌పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): శంకర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 19 మంది బాలికలకు హెచ్ పి వి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమం 90 రోజుల వరకు కొనసాగుతుందని తల్లిదండ్రులు 14 సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. బాలికల ఆరోగ్యం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.