26-05-2025 12:11:57 AM
-ఏఐఎఫ్‌టీవో జాతీయ సదస్సులో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని..కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశా రు.
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశంలో జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో ఆదివారం జరి గింది. ఈ సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ..ఓపీఎస్ సాధన కో సం అన్ని రాష్ట్రాల టీచర్లు ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఏఐ ఎఫ్‌టీవో బలోపేతానికి పీఆర్‌టీయూఎస్ సంఘం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ర్టంలో టీచర్ల సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణలోని అన్ని జిల్లాల టీచర్లను సమైక్యం చేస్తున్నామని, శాసనమండలిలో నూ టీచర్ల సమస్యలను వాడీవేడిగా లేవనెత్తేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. మారుమూల ప్రాం తాల టీచర్లు సైతం తమ ఇబ్బందులు చెప్పేందుకు వారికి అందు బాటులో ఉండే వ్యవస్థను రూపొందించామన్నారు.
గ్రామీణ ప్రాంత టీచర్లు చిన్న సమస్యను తీసుకొచ్చినా దాన్ని సీఎం దృష్టికి తీసుకె ళ్తున్నట్టు చెప్పారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో ఎలాంటి మెతకవైఖరి, రాజీ ధోరణి అనుసరించబో మని భరోసా ఇచ్చారు. సమావేశంలో పీఆర్‌టీయూటీఎస్ సంఘం అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, ఏఐఎఫ్‌టీవో బాధ్యులు గీత, త్రివే ణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.