వైభవ్ దెబ్బకు ట్రై సిరీస్ లైవ్
సోనీ సంస్థ కీలక నిర్ణయం
ముంబై, జూన్ 3: అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇంకా అరంగేట్రం చేయకముందే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదు. వైభవ్ కారణంగా భారత్ ఏ , శ్రీలంక ఏ, ఆప్ఘనిస్థాన్ ఏ జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్‌కు ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో వైభవ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు.
బుమ్రా నుంచి కమిన్స్ వరకూ పలువురు అంతర్జాతీయ స్టార్ బౌలర్లను ఉతికారేశాడు. దీంతో అతను ఎప్పుడు ఏ మ్యాచ్ ఆడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వైభ వ్ సూర్యవంశీ క్రేజ్ కారణంగా అభిమానుల్లో ఆసక్తిని గమనించిన నిర్వాహకులు ఈ ట్రై సిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించి సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక ప్రకటన చేసింది. సూర్యవంశీ ఎక్స్ ప్రెస్ ట్రై సిరీస్ కోసం దూసుకొస్తుంది అంటూ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది.
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సోనీ సంస్థ పెద్ద ప్లాన్స్‌తో రెడీ అయింది. గతం లో ఏ జట్ల సిరీస్‌లు గానీ, మ్యాచ్‌లు గానీ ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు వైభవ్ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సోనీ సంస్థ ట్రై సిరీస్ ప్రసార హక్కులను దక్కించుకుంది. ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా తిలక్ నే ఎంపిక చేసినా అందరి దృష్టి మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది.






