టీమిండియా కివీస్ టూర్ ఖరారు
5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టులు
సుధీర్ఘ టూర్‌లో 12 మ్యాచ్‌లు
వెల్లింగ్టన్, జూన్ 3: న్యూజిలాండ్‌లో భార త జట్టు ఈ సారి సుధీర్ఘంగా పర్యటించబోతోంది. ఇరు దేశాల మధ్య క్రీడాసంబంధాలకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా టీమిండి యా కోసం కివీస్ బోర్డు పెద్ద టూర్ ప్లాన్ చేసింది. అభిమానులను అలరించేందుకు ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టులతో సిరీస్‌ను ప్రకటించింది.
దీని కోసం అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1వరకు భారత జట్టు అక్కడ పర్యటించనుంది. దీంతో న్యూజిలాండ్ ఇప్పటి వరకూ ఆతిథ్యమిచ్చిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌గా ఇది నిలవనుంది. అలాగే ఒక పర్యటనలో ఓ విదేశీ జట్టుతో కివీస్ ఆడనున్న అత్యధిక మ్యాచ్‌ల సిరీస్ కూడా ఇదే. మొదట అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్‌తో ఈ టూర్ మొదలవుతుంది. టీ20 సిరీస్‌కు క్రైస్ట్ చర్చ్, వెల్లింగ్టన్, ఆక్లాండ్, హామిల్టన్ ఆతిథ్యమివ్వనున్నాయి.వన్డే సిరీస్ నవంబర్ 4 నుంచి, టెస్ట్ సిరీస్ నవంబర్ 19 నుంచి జరుగుతాయి.
కివీస్ టూర్‌లో భారత్ షెడ్యూల్
అక్టోబర్ 22 : తొలి టీ20(క్రైస్ట్‌చర్చ్)
అక్టోబర్ 24 : రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్)
అక్టోబర్ 27 : మూడో టీ20 (వెల్లింగ్టన్)
అక్టోబర్ 30 : నాలుగో టీ20 (క్రైస్ట్‌చర్చ్)
నవంబర్ 1 : ఐదో టీ20 (క్రైస్ట్‌చర్చ్)
నవంబర్ 4 : తొలి వన్డే (ఆక్లాండ్)
నవంబర్ 7 : రెండ్ వన్డే(వెల్లింగ్టన్)
నవంబర్ 10: మూడో వన్డే (హామిల్టన్)
నవంబర్ 13: నాలుగో వన్డే(మౌంట్మాంగనూయి)
నవంబర్ 15: ఐదో వన్డే (మౌంట్ మాంగనూయి)
నవంబర్ 19 : తొలి టెస్ట్ (వెల్లింగ్టన్)
నవంబర్ 27 1 : రెండో టెస్ట్ (క్రైస్ట్‌చర్చ్)






