calender_icon.png 1 January, 2026 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల్లో నేడు వైకుంఠ ద్వార దర్శనం

30-12-2025 12:00:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి పురస్కరించు కొని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అనేక దేవా లయాలను ఇందుకోసం ప్రత్యేకంగా ముస్తా బు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు ఎక్కువ సం ఖ్యలో దేవాలయాలకు వచ్చే అవకాశం ఉం డడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.