వైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ శ్రీనివాస్
ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో వైశ్యులు మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్(జీవీబీఎల్) ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. జీవీబీఎల్ వ్యవస్థాపకులు, సీఈఓ రాజశేఖర్ మంచీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ కుమార్, కెపీసీ ప్రాజెకట్స్ సీఎండీ కె.అనిల్ కుమార్, సుధాకర్ పీవీసీ డైరెక్టర్ మీలా జయదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వైశ్యులు వ్యాపారాభివృద్ధితో పాటు క్షేత్రస్థాయి దాతృత్వంలోనూ ముందుండాలని అన్నారు. రాజశేఖర్ మంచీ మాట్లాడుతూ వ్యాపారవేత్తల నెట్వర్క్ను బలోపేతం చేయడం, స్టార్టప్లు, జాయింట్ వెంచర్లు, కమ్యూనిటీ వ్యాపారాభివృద్ధికి జీవీబీఎల్ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీవీబీఎల్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్, ఉపాధ్యక్షులు టీ. క్రాంతి, బి. సంతోష్, టి.శివ, జి. శ్రీనివాస్, జి. నిఖిల్, కె.భరత్ కుమార్, కార్యదర్శి రవి కొండూరి, కోశాధికారి సి. తరుణ్, కార్యవర్గ సభ్యులు కె. వేణు, ఆర్. ప్రసాద్, కృష్ణ మోహన్ గుప్తాతో పాటు రాష్ట్రంలోని 14 చాప్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.






