6 August, 2026 | 2:28 AM

విలువలతో కూడిన విద్య అవసరం

06-08-2026 01:50 AM

విఎస్‌యు వీసీ శ్రీనివాసరావు 

మేడ్చల్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలతో  కూడిన విద్య అవసరమని వీఎస్ యూ వైస్ ఛాన్స్లర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు. గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి లక్ష్యాలను సాధించాలని, దేశ నవనిర్మాణంలో ఇంజనీర్ కీలకపాత్ర పోషించాలన్నారు.

గౌరవ అతిథిగా హాజరైన క్యాప్ జెమినీ సీనియర్ మేనేజర్ అంకుర్ మిట్టల్ మాట్లాడుతూ ఐటి సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను బీటెక్ మొదటి సంవత్సరం నుంచే నేర్చుకోవాలన్నారు. టీం వర్క్, అడాప్టబిలిటీ భవిష్యత్తు కెరీర్ కు పునాదులు అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా సోషల్ గవర్నెన్స్ అడ్వైజర్ రోహిణి నాయుడు, వి యాక్సిస్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈఓ వికాస సురేంద్రన్, మైక్రోసాఫ్ట్ సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ రజనీ, ఇంటర్నేషనల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రైనర్ పారుల్ కురానా, పోలీస్ డిపార్ట్మెంట్ మోటివేషనల్ డీజీ రామ్మూర్తి, గ్రాడ్ స్ట్రీట్ సీఈవో దుర్గా నవీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జె. నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఆర్ లోకనాథం, కోశాధికారి జే త్రిలోక రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్ తదితరులు పాల్గొన్నారు.