26-09-2025 12:12:54 PM
రూ.61 లక్షల 61666 నోట్లతో అలంకరణ
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దుర్గామాత శరన్న వరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పట్టణంలోని బాబు క్యాంపు బస్తీ లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అవతారoలో ప్రత్యక్షమైంది. భక్తులు రూ. 61 లక్షల 61 వేల 666 నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి అవతారంలో కొలువుదీరిన అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సామూహిక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధనలక్ష్మి అవతారం లో భక్తులకు దర్శనమించిన దుర్గామాత ను తిలకించడానికి పెద్ద ఎత్తున వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి ధనలక్ష్మి అవతారం భక్తులను ఎంతగానో ఆలరించింది.