02-07-2025 12:44:46 AM
ఖమ్మం, జూలై 1 ( విజయ క్రాంతి ): మానవాళికి ప్రాణవాయువు అందించారు వనజీవి రామయ్య అని ఖమ్మం ఆర్డిఓ నరసింహారావు అన్నారు. మంగళవారం పద్మశ్రీ వనజీవి రామయ్య పుట్టినరోజు సందర్భంగా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రామయ్య మొక్కల నాటి మానవాళికి ఎంతో మేలు చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏ ఓ తాప్సిల్ హుస్సేన్, అర్బన్ ఎమ్మార్వో డి. సైదులు, డి. టి. శ్రీకాంత్, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తిగుళ్ల వెంకటరమణ ప్రధాన కార్యదర్శి మొగిలిచర్ల వెంకటేష్ గౌరవ అధ్యక్షులు నాంపల్లి పాపారావు, గౌరవ సలహాదారు డేర్ విద్యా సంస్థల చైర్మన్ దారిపల్లి కిరణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానుగుల రాధాకృష్ణ ఉపాధ్యక్షులు కాంపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.