calender_icon.png 2 July, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీన్యూస్ కార్యాలయంలో పోలీసులు

02-07-2025 12:45:25 AM

- టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసుపై దర్యాప్తు

- సహోద్యోగుల నుంచి వివరాల సేకరణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఆమె పనిచేసిన బంజారాహిల్స్‌లోని టీన్యూస్ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. స్వేచ్ఛతో కలిసి పనిచేసిన సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసున్నారు.

స్వేచ్ఛ ఎవరితో ఎలా ఉండేది, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడేది, ఏ సమయంలో ఇంటికి వెళ్లేది వంటి కీలక ప్రశ్నలను సంధిస్తూ సహోద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించారు. పూర్ణచందర్ వేధింపుల ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా పూర్ణచందర్ జూన్ 28న అర్ధరాత్రి చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.