calender_icon.png 12 August, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టమర్స్ నమ్మకాలను నిలబెట్టుకుంటూ చేస్తున్న వ్యాపారంలో లాభాల పంట

20-04-2025 08:14:57 PM

పుష్ప ఫిలిమ్ డైరెక్టర్ సుకుమార్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కస్టమర్స్ నమ్మకాలను నిలబెట్టుకుంటూ చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి చెందాలని పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్(Film director Sukumar) తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్ష గ్రాండ్ అరుణాచలం ప్యూర్ వెజ్ హోటల్(Varsha Grand Arunachalam Pure Veg Hotel) ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ... హోటల్ బిసినెస్ లో రాణించాలంటే పరిశుభ్రతతో పాటు కమ్మని రుచితో కూడిన వంటకాలు ఎంతో అవసరం అని అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ లో వర్ష గ్రాండ్ ఓ బ్రాండ్ గా వినియోగదారులకు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్, మాజీ కౌన్సిలర్ శంభిపూర్ క్రిష్ణ, హోటల్ నిర్వాహకులు ఆర్ ఎస్ చౌదరి, నానాజీ, శ్రీనివాస్ రావు, రమణి తదితరులు పాల్గొన్నారు.