గుట్టలో నేటి నుంచి వరుణ యాగం
20-07-2026 01:37 AM
యాదగిరిగుట్ట, జూలై 19 (విజయక్రాంతి): ఎల్‌నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో క్షామం నుంచి తక్షణ రక్షణ కో సం వర్షాలు కురవాలని, రాష్ట్రమంతా సస్యశ్యామలమై పాడిపంటలతో విలసిల్లాలని వేడుకుంటూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శివాలయంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు వర్ష పాశుపత వరుణయాగం తలపెట్టారు. విశ్వశాంతి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు వరుణయాగానికి ఏర్పాట్లు చేశారు.






