అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
20-07-2026 01:39 AM
ఎస్‌ఐ మధు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 19: సా మాజిక మాధ్యమాల్లో గాని బహిరంగంగా గాని అసత్య ప్రచారాలు,తప్పుడు సమాచా రం, పుకార్లు సృష్టించి ప్రచారం చేస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అర్వప ల్లి ఎస్త్స్ర పి మధు హెచ్చరించారు.
ఆదివారం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ మత విద్వేషాలు,రాజకీయంగా రె చ్చగొట్టే సందేశాలు లేదా వ్యక్తులకు పరువు నష్టం కలిగించే పోస్టులు చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు.సోషల్ మీడియాను బా ధ్యతాయుతంగా వినియోగించుకోవాలే త ప్పా.. రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సమాచార సాంకేతిక చట్టం(ఐటీయాక్ట్),భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరించారు.






