27 April, 2026 | 1:36 AM

ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి

27-04-2026 12:00 AM

ముకరంపుర, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కరీంనగర్ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని అశోక్ నగర్ వాసవి వీధిలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు సమస్యలను స్థానికులు, కమిటీ సభ్యులు మేయర్ దృష్టికి తెచ్చారు. వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని మేయర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.