వైభవంగా వాసవీ మాత జయంతి
27-04-2026 12:47 AM
నంగునూరు, ఏప్రిల్ 26: నంగునూరు మండల కేంద్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి మాత జయంతి వేడుకలను ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సేవా మార్గంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. వాసవి మాత చూపిన ధర్మం, సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మల్యాల శ్రీనివాస్, గాంధీ శ్రీనివాస్, కందుకూరి సత్యం, ఇరుకుల్ల రాజు, జోగిపర్తి ప్రకాష్, పాత సురేష్,ఇతర సభ్యులు పాల్గొన్నారు.






