27 April, 2026 | 1:51 AM

ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు

27-04-2026 12:10 AM

కోదాడ ఏప్రిల్ 26: కోదాడ పట్టణంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళ పుష్ప నీరాజనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు వంగవీటి రామారావులు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా, అమ్మవారి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవించిందని కొనియాడారు. ఆర్డీఓ సూర్యనారాయణ ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలు సమర్పించగా, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు యర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాగుబండి వీరయ్య-భద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి,ఆలయ ధర్మకర్తలు నాగు బండి రంగా, రంగనాథ్, యర్రా జ్యోతి, వశిష్ట, సరోజా, నీలా సత్యనారాయణ, వరల్ హిందూ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ, టీడీపి జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోష్నా, శ్రీధర్, ఈసీ మెంబర్స్ వెంకటరమణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.