27 April, 2026 | 1:48 AM

నల్లగొండలో వ్యభిచారముఠా గుట్టురట్టు

27-04-2026 12:12 AM

విటులు, నిర్వాహకుల అరెస్ట్

నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26: నల్లగొండ పట్టణంలో వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార నిర్వాహకులను, విటు లను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శనివారం హైదరాబాద్ రోడ్, శ్రీనగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంమేరకు సీఐ రాఘవరావు, ఎస్త్స్ర సైదులు సిబ్బంది దాడి నిర్వహించారన్నారు.

ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు పట్టుబడ్డారన్నారు.గుండ్రెడ్డి వెంకటరెడ్డి, లక్కమోరపు నవ్యలు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బు అవసరం ఉన్న యువతులు, వివాహితలతో పరిచయం పెంచుకుని వారిని అద్దె ఇంటికి పిలిపించేవారన్నారు.

వారి ఫోటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపించి, అదే ఇంట్లో వ్యభిచారం నిర్వహించేవారని తెలిపారు. ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో వ్యభిచారం నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డారన్నారు. ఈ కేసులో గుండ్రెడ్డి వెంకటరెడ్డి, లక్కమోరపు నవ్యతో పాటు ఉదయ్, శివకృష్ణలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామన్నారు. అలాగే బాధిత యువతులను కౌన్సిలింగ్ కోసం సఖి సెంటర్కు పంపినట్లు తెలిపారు.