12-12-2024 01:14:15 AM
కరికులమ్, సిలబస్, కామన్ అకడమిక్ క్యాలెండర్పైన సమీక్ష
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఉన్నత విద్యపై తెలంగాణ ఉన్నత విద్యామండలి నేడు, రేపు వరుసగా సమావేశాలను నిర్వహించనుం ది. గురువారం ఉన్నత విద్యపై, శుక్రవారం వీసీల సమావేశాలను నిర్వ హించనున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈయన ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో ఈ సమావేశాలను నిర్వహించి, పలు అంశాలపై చర్చించను న్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాల యంలో గురువారం జరిగే సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యపై చర్చించనున్నారు. శుక్రవారం జరిగే సమావేశానికి రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలోని 12 యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో కరికులమ్, సిలబస్లో మార్పు, కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్స్, కౌన్సిలింగ్ ద్వారా ఇంజినీరింగ్ బీ సీట్ల భర్తీ లాంటి అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే పాఠశాల విద్యపై విద్యాశాఖ ముఖ్యకార్య దర్శి ఎన్ శ్రీధర్ బుధవారం సచివాలయంలో సమీక్షను నిర్వహించి అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు.