calender_icon.png 9 November, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో వైభవంగా శివునికి అన్న పూజ

09-11-2025 04:43:08 PM

శ్రీ వీరభద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు..

అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా శివునికి అన్నపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వీర శివ లింగాయత్ ఆధ్వర్యంలో శ్రీ వీరభద్ర స్వామి వార్షికోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూజారులు వల్లకొండ మఠం మహేష్, వల్ల కొండ రమేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్ తో పాటు పెద్దఎత్తున ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. రాజశేఖర్, రవీందర్, దేవేందర్, భాస్కర్, మల్లికార్జున్, నాగేశ్వర్, శంకర్, రాజు దంపతులతో పాటు శివాలయ భక్తబృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.