calender_icon.png 9 May, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు

08-05-2025 12:51:54 AM

-హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి) : శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 332 వ ఆరాధన మహాత్సవాలు బుధవారం ట్యాంక్బండ్ పై విశ్వకర్మ పౌండేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి రాష్ట్ర  బిసి సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మధుసూదనాచారి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ  వి.హనుమంతరావు, తెలంగాణ బిసి కమిషన్ చైర్మెన్ నిరంజన్, ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠా గోపాల్ పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి  విగ్ర హానికి పూలమాలలు వేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ స్వామివారి చరిత్ర, గొప్పదన భవిత్రాత తరాలకు ఎంతో అవసరమని, అందుకు తగిన చర్చలు ఆడుకుంటున్న విశ్వకర్మ పౌండేషన్ ప్రతినిధు లను అభినందించారు. ఉత్సవ సమితీ కన్వీనర్, విశ్వకర్మ పౌండేషన్ వ్యవస్థాపకు అడ్లూ రి రవీంద్రాచారి మాట్లాడుతూ స్వామివారి ఆరాధన, జయంతి ఉత్సవాలను ప్రభుత్వం జరపాలని కోరారు. అందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ కోట వెంకటాచారి, మదన్ మోహన్, కుందారం గిగేష్ చారి, త్రిమూర్తుల గౌరిశంకర్, విశ్వకర్మ పౌండేషన్ సభ్యులు మాదవరావు, సంగోజు రాఘవేందర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.