08-05-2025 12:49:14 AM
-ఎమ్మెల్యే ముఠాగోపాల్
ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి): ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉం టూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం రాత్రి తీవ్ర గాలి దుమానం వల్ల గాంధీనగర్ జగదాంబ హాస్పిటల్ వెనుకాల లైన్లో బారి చెట్టు కూలింది.
దీంతో రెండు విద్యుత్ స్తంభాలు, అదే విధంగా ట్రాన్స్ఫా ర్మర్ దెబ్బ తినడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడ్డది. దీంతో స్థానికులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి. యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని జిహెచ్‌ఎంసి, విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అధికారి ఇందిరా పార్క్ ఏడి సంపత్ కుమార్, గాంధీనగర్ ఇన్చార్జి ఏ ఈ సంతోష్ ఆనంద్ లు వారి సిబ్బందితో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మరమ్మత్తులు చేపట్టి విద్యుత్ సరఫరా ను పునరుద్ధరించారు.
మరమ్మత్తు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ వారికి సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఫోన్ చేసిన వెంటనే స్పందించిన , సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ముఠా గోపాల్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.