1 June, 2026 | 11:54 PM

31 మందికి రూ.3లక్షల 17 వేలు జరిమానా

15-11-2025 07:55 PM

సిద్దిపేట క్రైం: మద్యం సేవించి  వాహనాలు నడిపిన 3.17 లక్షల జరిమానా పడిందని  ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలతోపాటు రాజీవ్ రహదారిపై  వాహనాలు తనిఖీ చేయగా, 31 మంది మద్యం సేవించి  వాహనాలు నడుపుతున్నట్టు బ్రీత్ ఎనలైజర్ తో గుర్తించినట్టు చెప్పారు. వారిని శనివారం సిద్దిపేట అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ముందు హాజరుపరచగా జరిమానా విధించారని సీఐ తెలిపారు.