15-11-2025 07:56:32 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండే ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని అఖండ దీపం వెలిగించారు. ఈ అఖండ దీపం వెలిగించి శనివారం నాటికీ 41 రోజులు పూర్తి కావడంతో అఖండ దీపాన్ని మంగళ హారతులు తో బోథ్ పట్టణం లోని పురవీధుల గుండా పల్లకి శోభాయాత్ర నిర్వహించారు. బోథ్ కి చెందిన సేరే లక్ష్మీ గొప్ప సంకల్పంతో ఈ అఖండ దీపం వెలిగించి భజన బృంద సభ్యులు, ఆలయంకి వచ్చే నిత్య భక్తులతో నిత్య అన్నదానం చేశారు. ఈ శనివారం ఏకాదశి పురస్కరించుకొని అఖండ దీపం పల్లకి లో సన్నాయి మేళాలతో మంగళహారతి తో కన్నులు పండువగ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం మహా అన్నప్రసాదం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయ కమిటి సభ్యులు, నిత్య భజన బృందం, భక్తులు పాల్గొన్నారు.