calender_icon.png 15 November, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే పాయల్ శంకర్ కృషితో 54 మంది ఉద్యోగుల రెన్యువల్

15-11-2025 07:54:24 PM

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగుల కొనసాగింపు గందరగోళానికి తెర పడింది. గత 7 నెలలుగా తమను రెన్యువల్ చేయాలంటూ 54 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సైతం తమ సమస్యలు విన్నవించారు. అయితే ఎమ్మెల్యే పలుమార్లు రాష్ట్ర మంత్రితో పాటు డిఎంఈ కి ఉద్యోగుల సమస్యలు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు 54 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి కొనసాగించేలా తాజాగా ప్రభుత్వం జీవో ను విడుదల చేసింది. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని కలిసి పులబోకె అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.