యూపిలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం
31-05-2024 07:09 PM
ఉత్తరప్రదేశ్: యూపిలోని బులంద్‌షహర్ జిల్లా కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల్లో దగ్ధమైన వాహనాలను పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేశారు. ఆ ప్రాంతామంతా దట్టమైన పొగ వ్యాపించాడంతో పోలీసులు అగ్నిమాపక యంత్రాలను ఘటన స్థలానికి తెప్పించి మంటలను ఆర్పేసినట్టు ఎస్పీ రోహిత్ మిశ్రా తెలిపారు. ఈ అగ్నిప్రమాద సమయంలో దాదాపు 30 వాహనాలు అక్కడే ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వాహనాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.






