6 July, 2026 | 2:25 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

నేటి నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

13-06-2025 02:27 AM

మహబూబాబాద్, జూన్ 12 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రతిష్టాత్మకమైన శ్రీ బూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 15న స్వామి వారి కల్యాణ వేడుకలు, మహా అన్నదానం, శోభాయాత్ర,  16న చక్రస్నానం , పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు వోలం మురళి, కోశాధికారి కోయగూరి యాకూబు రెడ్డి, అంబటి మహేందర్ రెడ్డి, బానాల నాగరాజు తెలిపారు. బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.