6 July, 2026 | 1:14 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

వాగేశ్వరిలో ప్రెషర్స్ డే..

13-06-2025 02:27 AM

తిమ్మాపూర్ జూన్ 12 విజయ క్రాంతి:మండలంలోని రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో నవోత్సాహ పేరిట ప్రెషర్ డే వేడుకలను గురువారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈడీ సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ విద్యార్థులకు స్వాగతోచ్ఛవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు కళాశాల జనరల్ సెక్రటరీ డా.గండ్ర శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రానున్న రోజుల్లో దేశంలోని సాఫ్ట్వేర్ రంగానికి ముఖ్యపాత్ర పోషిస్తోందనీ, ఆ రంగంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు ఆనందంగా ఆడి పాడారు. కళాశాల సంయుక్త కార్యదర్శి డా. డీ శ్రీనివా స్ రెడ్డి, డైరెక్టర్ డైరెక్టర్లు విశ్వనాథ్ వినోద్, ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సీఎస్‌ఈ విభాగాధిపతి డా. ఎన్ చంద్రమౌళి తదితరులుపాల్గొన్నారు.