6 July, 2026 | 3:39 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

జాతీయ స్థాయి ఒలంపియాడ్లలో అల్ఫోర్స్ విద్యార్థులకు బంగారు పతకాలు

13-06-2025 02:26 AM

కరీంనగర్, జూన్ 12 (విజయ క్రాంతి): వివిధ జాతీయ స్థాయి ఒంలపియాడ్లలో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలతో పాటు నగదు బహుమతులను సాధించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన రసగ్న ఇంగ్లీష్ ఒలంపియాడ్లో బంగారు పతకం, హేమంత్ జాదవ్ కంప్యూటర్ ఒలంపియాడ్లో బంగారు పతకం, ఎ. శ్రీయాన్ రెడ్డి, యు. సాత్రివ్, ఇ. లిఖిత్ కుమార్, పి. నమన్విత హింది ఒలంపియాడ్ లో బంగారు పతకాలు, హవీష్ రెడ్డి, యం. శివేన్ రెడ్డి సోషల్ ఒలంపియాడ్లో బంగారు పతకాలు,

ఎ. యశ్ చంద్ర సోషల్ ఒలంపియాడ్ స్టేట్ టాపర్, బి. తన్మయి నేషనల్ ఎస్సే ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్, ముగ్గా హాసిని ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్, ఎ. శ్రీయాన్ రెడ్డి సోషల్ ఒలంపియాడ్లో స్టేట్ ర్యాంక్ లు సాధించారని తెలిపారు. సందర్భంగా విద్యార్థుల అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.