15-06-2025 07:34:37 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు శ్రావణ నక్షత్ర యుక్త స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik), ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం కేసముద్రం పట్టణ పురవీధుల్లో అశ్వరథంపై దేవేరుల శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.