వెన్నెల కిశోర్‌ది రైలుకు ఇంజిన్ లాంటి క్యారెక్టర్
వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచనాదర్శకత్వం వహిస్తున్నారు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25న థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భం గా డైరెక్టర్ మోహన్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఏడుగురి కథ. వెన్నెల కిశోర్‌ది డిటెక్టివ్ రోల్. రైలుకు ఇంజిన్ లాంటి క్యారెక్టర్. మిగతా బోగీ లూ ము ఖ్యమే. ప్రతి పాత్రా కథలో చాలా కీలకం గా ఉంటుంది.
డిటెక్టివ్ రోల్ కొంచెం హ్యూమర్‌తో ఉంటుంది. ఆ పాత్రకు వె న్నెల కిశోర్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారు. ఆయన ఉత్తరాంధ్ర యాసను నేర్చుకొని సినిమా చేశారు. కథలో క్రైమ్ కామెడీ ఎమోషన్ థ్రిల్ లవ్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. -ఇది 1991లో జరిగే కథ. రాజీవ్ గాంధీ వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. అదే రోజు ఇంకొన్ని సంఘటనలు జరిగాయి.
వీటి మధ్య సంబంధమేంటనేది షెర్లాక్ హోమ్స్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌తో ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో చేశాం. రైటర్‌గా పూర్తిగా అనుభవం సాధించిన తర్వాతే దర్శకుడు కావాలనుకున్నా. -నెక్స్ ఎమోషనల్ జోనర్‌లో ఓ సినిమా చేస్తా.. స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది” అని వివరించారు.






